జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రమంతా సోమవారం నిర్వహిస్తే జనగామ లోని సిద్దాంతుల పిలుపుమేరకు మంగళవారం రోజున దసరా ఉత్సవాలు నిర్వహించుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో పట్టణంలోని బతుకమ్మ కుంటలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్టేజ్ ను జనగామ పోలీసులు తొలగించారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో రామణవధ కార్యక్రమాన్ని జనగామ డీసీపీ పి. సీతారాం ప్రారంభించారు.
జిల్లా ప్రజలు ఒకరినొకరు అయ్ బలాయ్ తీసుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది జిల్లా ప్రజలు, జనగామ, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, బండ యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.