ఫాస్ట్ ఫుడ్ తింటే..గొర్రె పొట్టేలు, మేకపోతు..ఫుల్ బాటిల్

చుక్క ముక్క లేకుండా దసరా పండగ నడవదు.  దసరా వచ్చిందంటే కౌసు లేంది ముద్ద దిగదు. అందుకే ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని  వినూత్నంగా ఆలోచించాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దసరా పండగ వేళ లక్కీ డ్రా నిర్వహిస్తున్నాడు.

ధర్మపురి పట్టణంలో 15 ఏళ్లుగా  ఫుడ్ ను ఆదరిస్తున్నారని.. అందుకే దసరా  పండగ వేళ  డ్రా పెట్టామని ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు తెలిపారు. ఈ  డ్రా లోమొదటి బహుమతి కింద గొర్రె పొట్టేలు, రెండో బహుమతి కింద మేక పోతు, మూడో బహుమతి కింద 100 మందికి ఫుల్ బాటిల్ మందు, నాలుగో బహుమతిగా నాటు కోడి పుంజు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఐదో బహుమతి నాటుకోడి పెట్ట ఇస్తున్నామని చెప్పారు. 

ALSO READ : సెంటిమెంట్ రిపీట్ కావాలె..వంద సీట్లు గెలవాలె : కేసీఆర్