- స్పెషల్ సర్వీసులు నడిపినా ఆదాయం అంతంతే
హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీకి దసరా పండుగ మంచి ఆదాయం తీసుకొస్తుందని ఆశపడ్డ మేనేజ్మెంట్కు నిరాశే ఎదురైంది. రాఖీ పండుగతో పోల్చుకుంటే.. దసరాకు ఆదాయం భారీగా తగ్గింది. ఈ ఏడాది ఆగస్టు 19న రాఖీ పండుగ రోజు ఆర్టీసీకి రూ.32 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో 15 కోట్ల రూపాయలు నగదు కాగా, రూ.17 కోట్లు మహాలక్ష్మీ పథకం ద్వారా వచ్చాయి.
అయితే, దసరా సందర్భంగా ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడిపినా.. అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదు. కేవలం 14వ తేదీ రోజు సుమారు రూ.30 కోట్ల ఆదాయం వచ్చిందని, రాఖీ పండుగతో పోల్చుకుంటే రూ.2 కోట్లు తక్కువే అని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.