నల్గొండ జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు

నల్గొండ జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శనివారం దసరా పండుగను ఘనంగా నిర్వహించారు. జమ్మి ఆకును పరస్పరం పంచిపెట్టుకొని ఆలింగనాలు చేసుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణుడి బొమ్మను దహనం చేశారు. దసరా రోజున ఇంటి దేవతలతోపాటు దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఆలయాల్లో ఉత్సవ మూర్తులను దర్శించుకొని పూజలు చేశారు. సాయంత్రం సమయంలో జమ్మి చెట్టుకు పూజ చేసి కంకణాలు ధరించారు.

 అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకును ఇచ్చిపుచ్చుకొని ఆలింగనాలు చేసుకున్నారు. అనంతరం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పది తలల రావణాసురుడి బొమ్మకు బాంబులు అమర్చి పేల్చి వేశారు. రావణుడి దహనాన్ని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‌‌‌‌ - వెలుగు నెట్​వర్క్​