హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లకు దసరా సెలవులు ముగిశాయి. మంగళవారం నుంచి ప్రైవేటు, సర్కారుతో పాటు అన్ని రకాల మేనేజ్మెంట్ల స్కూళ్లు రీ ఓపెన్ కానున్నాయి. ఈ నెల 2 నుంచి 14 వరకూ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.
ఈ హాలీడేస్ సోమవారంతో ముగిశాయి. అంతకు ముందే సర్కారు, ప్రైవేటు జూనియర్ కాలేజీలు సోమవారమే ప్రారంభమయ్యాయి. ఆయా కాలేజీలకు ఈ నెల 6 నుంచి 13 వరకు సర్కారు హాలీడేస్ ప్రకటించింది. మరోపక్క వివిధ వర్సిటీల పరిధిలో డిగ్రీ, పీజీ కాలేజీలు మంగళవారం రీ ఓపెన్ కానున్నాయి.