హైదరాబాద్: పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ. బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నందున తెలంగాణలో అక్టోబర్ 2నుంచి 14వ తేదీవరకు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు. అక్టోబర్ 15న పాఠశాలలు పునప్రారంభం అవుతాయి.
విద్యాశాఖ ఆదేశాలు పాటించకుండా స్కూళ్లు నడిపితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఇవాళ(అక్టోబర్ 1న) పాఠశా లల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహించారు. కాగా తెలంగాణలోని అన్ని కాళేజీలకు అక్టోబర్ 6 నుంచి దసరా సెలవులు ప్రకటించారు.