దసరా సంబురాలు ఉమ్మడి జిల్లాలో వైభవంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారు జామునుంచే ఆలయాలు భక్తుల ప్రత్యేక పూజలు, ఆయుధ పూజలతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం సమయంలో గ్రామ శివారుల్లో పాలపిట్టను దర్శించడంతో పాటు వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ శమీ పూజ చేశారు. అనంతరం బంధువులు, స్నేహితులకు జమ్మి పెట్టి శుభాకాంక్షలు చెప్పారు. పలు చోట్ల రావణ దహనాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు పేలుస్తూ కేరింతలు కొడుతూ.. సందడిగా గడిపారు
- నెట్‌వర్క్, వెలుగు