మనలో ప్రతి ఒక్కరికి కలలు రావడం అనేది సహజం. మనం ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తామో.. అవే మనకు కలలో కూడా వస్తుంటాయి. అయితే కొన్ని భవిష్యత్ లో జరగబోయే సంఘటనలు కూడా కలలుగా వస్తూ ఉంటాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. దుర్గమ్మ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. అమ్మ అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. కాబట్టి ఈ నవ రాత్రుల్లో ఎంతో నియమ నిబద్ధతలతో అమ్మవారిని పూజిస్తారు.
అయితే ఈ శరన్నవరాత్రుల్లో కలలో అమ్మవారికి సంబంధించిన కొన్ని కలలు వస్తే శుభం కలుగుతుందని చెప్తూంటారు పెద్దలు. ఆ కలలు వస్తే దుర్గా మాత అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. మరి ఆ కలలు ఏంటి? ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దుర్గమ్మ విగ్రహం కనిపించడం..
దసరా శరన్నవరాత్రుల్లో కనక దుర్గ అమ్మవారి విగ్రహం కనిపిస్తే చాలా మంచిదట.. అయితే మీ కలలో దుర్గాదేవి కనిపిస్తే... అమ్మవారి అనుగ్రహం మీపై ఉందని పురాణాలు చెబుతున్నాయి.
సింహ వాహనంపై దుర్గామాతా..
దుర్గాదేవి అమ్మావారు సింహ వాహనంపై స్వారీ చేస్తున్నట్టు మీకు కలలో కనిపిస్తే.. మీరు అనుకున్న పనిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ పనులు పూర్తి అవుతాయని.. అంతే కాకుండా జీవితంలో సానుకూల మార్పులు ఉన్నట్టు అమ్మవారు తెలుపుతున్నట్టేనని చెబుతుంటారు పెద్దలు.
అమ్మవారి అలంకరణ వస్తువులు..
అమ్మవారిని అలంకరణ వస్తువులు అంటే కుంకుమ, పసుపు, గాజులు, ముక్కుపుడక, ఎరుపు రంగు వంటి వస్తువులు మీ కలలో కనిపిస్తే.. మీ సమస్యలకు ముగింపు దొరికినట్టే అని సంకేతంగా భావించవచ్చని అర్థం.
అమ్మవారు ఏనుగుపై కనిపిస్తే..
ఏనుగుపై దుర్గామాత స్వారీ చేస్తున్నట్టు కలలో కనిపిస్తే.. అది విజయానికి సంకేతంగా మనం భావించవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అంటే మన చేయబోయే పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవుతాయని భావించవచ్చు.
ALSO READ : దసరా పండుగ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే..
పాలు, పాల ఉత్పత్తులు కనిపిస్తే..
ఈ దసరా శరన్నవరాత్రుల్లో మీ కలలో పాలు లేదా పాల ఉత్పత్తులు కనిపించడం వల్ల.. మీరు చేపట్టిన విజయంతో పాటు సమాజంలో గౌరవం లభిస్తున్నట్టు మనం భావించవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
ఈ దసరా శరన్నవరాత్రుల్లో ఇలా వీటిల్లో ఎలాంటి కలలు వచ్చినా అమ్మవారి అనుగ్రహం మనకు సిద్ధిస్తుందని.. శుభ సూచికం కలుగుతుందని.. అమ్మవారి కృపకు పాత్రులం అవుతామని భావిస్తుంటారు భక్తులు.