దుర్గం చెరువులో మురుగుకు చెక్​ పెట్టాలి

దుర్గం చెరువులో మురుగుకు చెక్​ పెట్టాలి
  • జీహెచ్ఎంసీ కమిషనర్​ ఇలంబరితి

హైదరాబాద్​సిటీ/మాదాపూర్, వెలుగు: దుర్గం చెరువులోకి చేరే మురుగునీటికి చెక్ పెట్టి, వర్షపు నీరు చేరేలా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్​ఇలంబరితి శేరిలింగంపల్లి జోన్​అధికారులను ఆదేశించారు. మంగళవారం మాదాపూర్​లోని దుర్గం చెరువును జోనల్​కమిషనర్, జలమండలి, ఇంజినీరింగ్​అధికారులతో కలిసి కమిషనర్​పరిశీలించారు. వాటర్​బోర్డు చేపట్టనున్న మురుగునీటి డైవర్షన్ నిర్మాణ పనులపై చర్చించారు. 

ఎస్ఎన్డీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న స్ట్రామ్ వాటర్ లైన్ పురోగతిని పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ మురుగునీటిని దారి మళ్లించేలా డ్రైనేజీల నిర్మాణానికి సమర్థవంతమైన ప్లాన్లు రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్​లోనూ మురుగునీటి పరిమాణాన్ని తట్టుకునేలా పైపుల నిర్మాణం ఉండాలన్నారు. వర్షపు నీరు స్ట్రామ్ వాటర్ చెరువులోకి చేరేలా నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్, సంబంధిత విభాగాల అధికారులను బల్దియా కమిషనర్ ఇలంబరితి ఆదేశించారు.