ముంబైలో దుమ్ము తుఫాను.. భారీ వర్షానికి ముందు బీభత్సం..

ముంబైలో దుమ్ము తుఫాను.. భారీ వర్షానికి ముందు బీభత్సం..

ముంబైని దుమ్ము తుఫాను వణికించింది.. శుక్రవారం ( ఏప్రిల్ 4 ) మధ్యాహ్నం బలమైన గాలులతో చెలరేగిన దుమ్ము తుఫానుకు జనజీవనం స్తంభించింది. సిటీలోని చాలా ప్రాంతాలను దట్టమైన దుమ్ము కమ్మేయడంతో ట్రాఫిక్, రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.ఈ క్రమంలో ముంబైలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షం కురిసే అవకాశమున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించింది ఐఎండీ.

ఇదిలా ఉండగా ముంబైలో దుమ్ము తుఫానుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.. దుమ్ము తుఫాను ముంబైని వణికించిందని.. ఇది ది మమ్మీ సినిమాలో సీన్ ని తలపిస్తోందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. 

ముంబై అనూహ్యమైన సిటీ అని.. రోజంతా విపరీతమైన ఎండ ఉంటుందని.. సాయంత్రం అయ్యేసరికి దుమ్ము తుఫాను వస్తుందని.. ఇది చాలా కామన్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.