రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు

రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రోడ్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. పూడూరు నుంచి కొడిమ్యాల వెళ్లే రోడ్డు కొత్తగా నిర్మిస్తుండగా.. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాటు కొండగట్టు నుంచి

కొడిమ్యాల వెళ్లే దారిలో కూడా బ్రిడ్జి నిర్మించిన అధికారులు రెండు వైపులా అప్రోచ్‌‌‌‌ రోడ్డు వేయడం మరిచిపోయారు. నెలల తరబడి పనులు పెండింగ్‌‌‌‌లో ఉండడంతో మండలకేంద్రానికి వచ్చేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.