న్యూఢిల్లీ: థర్మల్ పవర్ కంపెనీ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) 4 వేల మెగావాట్ల సోలార్ కెపాసిటీని ఏర్పాటు చేయడానికి 2030 నాటికి రూ.20 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. మొత్తంగా థర్మల్, పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు, సోలార్ కరెంట్ ఉత్పత్తికి 2030 నాటికి రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని పేర్కొంది.
థర్మల్, గ్రీన్ ఎనర్జీ కెపాసిటీని అదనంగా 10 వేల మెగావాట్లు పెంచుకోవాలని చూస్తోంది. దీంతో కంపెనీ మొత్తం పవర్ కెపాసిటీ 16,700 మెగావాట్లకు పెరుగుతుంది. ప్రస్తుతం కంపెనీకి ఉన్న 6,700 మెగా వాట్ల ఇన్‌స్టాల్డ్ కెపాసిటీలో 6,540 మెగావాట్లు థర్మల్ ప్లాంట్ల నుంచి వస్తున్నాయి.