కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో సంచలన ఫలితం నమోదయింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ పై గయానా అమెజాన్ వారియర్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన దశలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్.. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ డ్వైన్ ప్రిటోరియస్ తన జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. చివరి బంతికి విజయం సాధించి ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో గయానా విజయానికి 16 పరుగులు కావాలి. తొలి బంతిని ప్రిటోరియస్ పరుగులేమీ చేయలేకపోయాడు. దీంతో గయానా విజయంపై ఎవరికీ అసలు లేవు. అయితే ఈ దశలో సఫారీ ఆల్ రౌండర్ మ్యాజిక్ చేశాడు. తర్వాత నాలుగు బంతులకు మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. చివరి బంతికి విజయానికి నాలుగు పరుగులు కావాల్సిన దశలో అమీర్ బౌలింగ్ లో కవర్స్ మీదుగా సిక్సర్ కొట్టి గయానాకు విజయాన్ని అందించాడు.
Also Read :- రైతుల నిరసనలో పాల్గొన్న వినేష్ ఫోగట్
గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ప్రిటోరియస్ ను చెన్నై జట్టు 2023 మినీ ఆక్షన్ లో రిలీజ్ చేసింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. అప్పటివరకు 3 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చిన అమీర్ చివరి ఓవర్లో 16 పరుగులను డిఫెండ్ చేయలేకపోయాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గయానా మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.
DWAINE PRETORIUS WHAT HAVE YOU DONE 🔥pic.twitter.com/PIIuExsRtj
— Durban's Super Giants (@DurbansSG) August 31, 2024