యాదగిరిగుట్టలో ఘనంగా ధ్వజారోహణం

యాదగిరిగుట్టలో ఘనంగా ధ్వజారోహణం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ప్రధానార్చకులు నల్లంతీగళ్‌‌‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, భేరిపూజ, దేవతాహ్వానం, హవనం నిర్వహించారు. అంతకుముందు స్వామివారిని ప్రత్యేక అలంకారంలో ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌‌‌‌ నర్సింహమూర్తి, ఈవో భాస్కర్‌‌‌‌రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌‌‌‌శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు, నవీన్, సూపరింటెండెంట్‌‌‌‌ రామారావు పాల్గొన్నారు.

నేడు మత్స్యావతారం, శేషవాహన సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నారసింహుడిని మత్స్యావతారంలో అలంకరించనున్నారు. రాత్రి 8.30 గంటలకు స్వామివారిని శేషవాహనంపై ప్రధానాలయ వీధుల్లో ఊరేగిస్తారు.