Dwayne Bravo: 20 ఏళ్ళ కెరీర్‌కు గుడ్ బై: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో

వెస్టిండీస్‌ దిగ్గజ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో  తన 21 ఏళ్ళ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇంస్టాగ్రామ్ వేదికగా శుక్రవారం (సెప్టెంబర్ 27) అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కు వీడ్కోలు చెప్పిన ఈ విండీస్ ఆల్ రౌండర్ తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ తన ప్రస్థానాన్ని ముగించాడు. 2006 నుంచి టీ20 క్రికెట్ ఆడుతున్న బ్రావో ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బ్రావో 582 మ్యాచుల్లో 631 వికెట్లు తీశాడు.

“ఈ రోజు నాకు అన్నీ అందించిన ఆటకు వీడ్కోలు పలుకుతున్నాను. నా జీవితన్నాని అంతా క్రికెట్ కు అంకితం చేసాను. నన్ను అంకితం చేసి మీరు నన్ను ఆదరించారు. అభిమానులకు ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. 21 ఏళ్ళ నా ప్రయాణం అద్భుతం. క్రికెట్ లో కొనసాగాలన్నా.. నా శరీరం సహకరించదు". అని బ్రావో తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. 

Also Read :- టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్

2004 అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన బ్రావో.. 2021లో తన అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లీగ్ లు ఆడుతూ బిజీ అయ్యాడు. 2023 లో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పి 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌ అవతారమెత్తాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 40 టెస్టులు.. 164 వన్డేలు.. 91 టీ20 మ్యాచ్ లాడాడు. అన్ని ఫార్మాట్ లలో మొత్తం 363 వికెట్లు పడగొట్టాడు. బ్యాటర్ గాను సత్తా చాటి 10000 కు పైగా పరుగులు చేశాడు. 161 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 4360 పరుగులతో పాటు.. 183 వికెట్లు పడగొట్టాడు.