Dwayne Bravo: జట్టును నిలబెట్టినా అతన్ని ఎందుకు తప్పించారు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై బ్రావో ఫైర్

Dwayne Bravo: జట్టును నిలబెట్టినా అతన్ని ఎందుకు తప్పించారు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై బ్రావో ఫైర్

వెస్టిండీస్ టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ గా రోవ్‌మన్ పావెల్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో విండీస్ టీ20 జట్టు కెప్టెన్ గా  షాయ్ హోప్‌ను ఎంపిక చేశారు. పావెల్ అద్భుతంగా జట్టును నడిపించినా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొత్తం 37 మ్యాచ్ ల్లో పావెల్ కెప్టెన్సీలో వెస్టిండీస్ 19 మ్యాచ్ ల్లో గెలిచి.. మరో 17 మ్యాచ్ లో ఓడిపోయింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆ జట్టు మాజీ క్రికెటర్ మాజీ కెప్టెన్ డ్వేన్ బ్రావో తన నిరాశను వ్యక్తం చేశాడు. విండీస్ బోర్డుపై మండిపడుతూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. 

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బ్రావో తన నిరాశను వ్యక్తం చేశాడు. "విండీస్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం విచారకరమని.. బోర్డు ఇప్పటికీ తమ ఆటగాళ్లను సరిగా చూసుకోవట్లేదని ఆయన అన్నారు. ఆటగాళ్ల పట్ల అన్యాయం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక మాజీ ఆటగాడిగా.. ఒక వెస్టిండీస్ క్రికెట్ ఫ్యాన్ గా ఇదొక అత్యంత చెత్త నిర్ణయం. జట్టు అట్టడుగున ఉన్నప్పుడు పావెల్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడని.. ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానానికి తీసుకెళ్లాడని బ్రావో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బ్రావో ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు.  

ప్రస్తుతం వెస్టిండీస్ వన్డే కెప్టెన్ గా షాయ్ హోప్‌ కు టీ20 సారధ్య బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి క్రెయిగ్ బ్రాత్‌వైట్ వైదొలిగాడు. అతని స్థానంలో విండీస్ టెస్ట్ జట్టు కెప్టెన్ ఎవరనే విషయం త్వరలో ప్రకటించాల్సి ఉంది. బ్రాత్‌వైట్ కెప్టెన్సీలో వెస్టిండీస్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియాలో తమ తొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. బ్రాత్‌వైట్ 2021లో టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ALSO READ : Virat Kohli: 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతా.. టైటిల్ గెలవడమే లక్ష్యం.. కన్ఫర్మ్ చేసిన కోహ్లీ!