న్యూఢిల్లీ : అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా పని చేయనున్నాడు. టీమిండియా చీఫ్ కోచ్‌గా వెళ్లిన గౌతమ్ గంభీర్ ప్లేస్‌లో బ్రావో బాధ్యతలు స్వీకరించనున్నాడు. గత వారం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బరిలోకి దిగిన బ్రావో ఇంజ్యురీతో టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. ‘నాకు అన్నీ ఇచ్చిన క్రికెట్‌కు ఈ రోజు గుడ్‌బై చెబుతున్నా.
21 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్ అద్భుతంగా సాగింది. ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశా. నా కలను నెరవేర్చుకునేందుకు వంద శాతం కష్టపడ్డా. ప్రతిసారి ఏదో రూపంలో సక్సెస్ సాధించా. ఇప్పుడు వాస్తవిక జీవితంలోకి అడుగుపెడుతున్నా. క్రికెట్‌తో నా అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది’ అని బ్రావో పేర్కొన్నాడు.
2021లోనే ఇంటర్నేషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన బ్రావో.. గతేడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. 2011లో సీఎస్కేతో చేరిన బ్రావో మూడు టైటిల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.