న్యూఢిల్లీ: వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ డారెన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన అతను విండీస్ క్రికెట్ బోర్డుతో తెగదెంపులు చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు క్రికెట్‌కు విరామం ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించాడు. గత నాలుగేళ్ల నుంచి కరీబియన్ క్రికెట్‌లో బ్రావో 96.2, 65, 48, 83.2 యావరేజ్‌తో రన్స్ చేస్తున్నాడు.
ఇక సీజీ యునైటెడ్ సూపర్ 50 కప్‌తో పాటు డొమెస్టిక్ టోర్నీల్లో సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌ను చూపెడుతున్నాడు. కానీ అధిక వయసు కారణంతో బ్రావోను సెలెక్టర్లు నేషనల్ టీమ్‌కు ఎంపిక చేయడం లేదు.