భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న డీవై చంద్రచూడ్ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. ఆయన పదవీరమణ సమయం దగ్గరపడింది. 2024 నవంబర్ 8న CJI డీ.వై చంద్రచూడ్ రిటైర్మెంట్ కానున్నారు. సుప్రీం కోర్టు సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ రెండు సంవత్సరాల కాలం పూర్తైంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆయన తండ్రి కూడా సుదీర్ఘ కాలం పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. జస్టిస్ వైవీ చంద్రచూడ్. 1978 నుంచి 1985 వరకు సుదీర్ఘకాలం సీజేఐగా పని చేసి చరిత్రలో నిలిచారు. వైవీ చంద్రచూడ్ తనయుడే జస్టిస్ డీవై చంద్రచూడ్. తండ్రి వైవీ చంద్రచూడ్ ఇచ్చిన రెండు తీర్పులకు పూర్తి వ్యతిరేక తీర్పులు ఇచ్చారు డీవై చంద్రచూడ్.
నేపాల్ లోని భూటాన్ లో అక్టోంబర్ 9న జస్టిస్ డీవై చంద్రచూడ్ JSW లా స్కూల్ కాన్వకేషన్ ప్రొగ్రామ్ కు హజరైయ్యారు. ఈక్రమంలో మరో నెల రోజులు మాత్రమే తన పదవీకాలం మిగిలి ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. 2022 నవంబర్ 9న ఆయన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత ఎన్నో సంచలన తీర్పుల ఇచ్చారు. ఎప్పటి నుంచో కోర్టులో ఉన్న క్రిటికల్ కేసులకు ఆయనే చెక్ పెట్టాడు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిస్పక్షపాతంగా ఆయన ఇచ్చిన తీర్పులు చరిత్రలో నిలిచిపోతాయి.
అయోధ్యలో రామమందిర నిర్మాణం, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత, అవివాహిత అబార్షన్ చేయించుకునే అనుమతి, స్వలింగ సంపర్కం నేరం కాదు, వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు, భీమా కోరేగావ్ కేసు, ఆధార్ బిల్లు, ఎలక్టోరోల్ బాండ్ల రద్దు.. ఇలా అనేక సంచలన తీర్పులు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఒకరు.
అనేక చారిత్రక తీర్పులు ఇచ్చిన సమర్థుడు డీవై చంద్రచూడు. ఆయన 2016 మే 13 నుంచి సుప్రీం కోర్టు జడ్జిగా, అంతకుముందు 2013 నుంచి 2016 వరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2000 నుంచి 2013 వరకు బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందించారు. 1998 నుంచి రెండేళ్ల పాటు భారత అదనపు సోలిసిటర్ జనరల్‌గా కూడా పని చేశారు.
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనమిక్స్‌లో హానర్స్ చేసిన చంద్రచూడ్. ఢిల్లీ యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొందారు. హార్వర్డ్ లోనే ఫొరెన్సిక్ సైన్స్‌లో డాక్టరేట్ తీసుకున్నారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో లాయర్ గా పని చేశారు. టెక్నాలజీపై మంచి పట్టు ఉండి.. న్యాయమూర్తిగా కాస్త కఠినంగా ఉంటూ.. చట్టాలను తూచా తప్పకుండా పాటించే చంద్రచూడ్.. ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆయన మంచి న్యాయమూర్తి. మంచి మనిషి.. అంటారు ఆయన సహచరులు.
తండ్రి తీర్పులకు వ్యతిరేకం చెప్పిన రెండు కేసులు
1976 లో శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్‌పూర్ కేసులో.. గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పరిగణించలేమని తెలిపింది. ఆ ధర్మాసనంలో అప్పటి సీజేఐ వైవీ చంద్రచూడ్ ఒకరు. అయితే, 2017లో గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన ధర్మాసనంలో డీవై చంద్రచూడ్ ఉన్నారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని తండ్రి చెబితే.. గోప్యత ప్రాథమిక హక్కని తనయుడు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.
మరోకేసులోనూ అలానే జరిగింది. 1985లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ ధర్మాసనం.. సౌమిత్ర విష్ణు కేసులో ఐపీసీ సెక్షన్ 497ను సమర్థించింది. సంబంధం కలిగి ఉండటానికి ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తి పురుషుడే కానీ, స్త్రీ కాదని సాధారణంగా అంగీకరించబడింది అని ధర్మాసనం తన తీర్పులో రాసింది. ఈ నిర్ణయాన్ని 2018 లో జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది.