ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు: భట్టి విక్రమార్క

ఇందిరమ్మ  స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు.   ఫ్రీ బస్సు కోసం నెలకు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.  200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.  ఇందిరమ్మ  ఆశయ స్పూర్తితో ముందుకెళ్తున్నామన్నారు భట్టి.    గతం తెలియని వారే ఇందిరమ్మ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దేశాభిమానం లేనివారే ఇందిరమ్మపై విమర్శలు చేస్తున్నారన్నారు. దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిరా ఫ్యామిలీదన్నారు.

బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామన్నారు భట్టి.   రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే సర్వేచేస్తున్నామన్నారు భట్టి. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేది సర్వే ఉద్దేశమన్నారు.

భూములు కోల్పోయే వారిని అన్ని రకాలు ఆదుకుంటామన్నారు భట్టి విక్రమార్క.  అందరికీ నచ్చ చెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటామన్నారు.  కొద్దిమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని.. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రపన్నుతున్నారని విమర్శించారు భట్టి.   బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  పేదల అకౌంట్లో 15 వేలు వేస్తామని మోసం చేశారన్నారు.  నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత  కాంగ్రెస్ దన్నారు.  జాబ్ క్యాలెండర్, యూపీఎస్ సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.  వరంగల్ లో ఇందిరా శక్తిని చాటి చెబుతామన్నారు భట్టి.