యూనివర్శిటీలపై కేంద్రం కుట్రలు : భట్టి

యూనివర్శిటీలపై కేంద్రం కుట్రలు : భట్టి

యూనివర్శిటీలపై కేంద్రం కుట్రలపై కలిసి పోరాడుదామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేరళ తిరువనంతపురంలోని జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో పాల్గొన్న ఆయన..  విద్యావ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపలేరని ఫైర్ అయ్యారు.  రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విధానాలను రూపొందించాలన్నారు. విద్యా, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రాల నిర్ణయాలను కేంద్రం గౌరవించాలన్నారు. 

Also Read :- కృష్ణా నీళ్ల దోపిడిలో మొదటి ద్రోహి కేసీఆర్

రాష్ట్రాలు పరిపాలన విభాగాలే కాదు..దేశ పురోగతికి జీవనాడులని భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం యూనివర్శిటీల్లో రాష్ట్రాల పాత్రను తొలగించాలని చూస్తోంది.  నియామకాల నుంచి అడ్మిషన్ల వరకు రాష్ట్రాలకు హక్కు లేకుండా చేసే కుట్ర చేస్తోంది.  ప్రజలకు  వ్యవస్థలకు సరిపోయే విద్యాసంస్థలను రాష్ట్రాలే నిర్మించుకుంటాయి.  ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి పోలిక ఉండదు.  సొంత నిర్ణయాలు లేకుండా నాణ్యమైన విద్యను ఏ రాష్ట్రం అందించలేదు.  రాష్ట్రాలు ఒక ఉమ్మడి లక్ష్యంతో ఐక్యమైనపుడు  కేంద్రం తప్పక వినాలి. ఒక రాష్ట్ర విద్యార్థుల నాడి ఆ రాష్ట్రానికి తెలుస్తుంది అని భట్టి అన్నారు.