ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ప్రతి నెలా ఖర్చు చేయాలని ఆయా శాఖలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై సమీక్షించారు. ఖర్చు చేసిన నిధులను ప్రతినెలా వెల్లడించాలని ఆదేశించారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఇప్పటి వరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు రాబోయే రెండు నెలల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. సెస్ అధికారులు నివేదికను ఫైనాన్స్ ,ప్లానింగ్ కమిషన్ కు అందించాలన్నారు భట్టి.
అటవీ భూముల్లో సోలార్ పవర్ వినియోగించడం. ఫామాయిల్, వెదరు, అవకాడో వంటి సాగును ప్రోత్సహించడంపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు భట్టి. మూసీపరివాహకంలో నష్టపోతున్న ఎస్సీ,ఎస్టీలను స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్పించి వడ్డీలేని రుణాలు ఇప్పించాలన్నారు. ఇందిర జలప్రభ, మరమ్మతులకు గురైన ఎత్తిపోతలను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని చెప్పారు భట్టి.