గుడ్ న్యూస్: రూ. 3 లక్షల సర్కార్ లోన్..మార్చి 17 నుంచి అప్లై చేసుకోండి

గుడ్ న్యూస్: రూ. 3 లక్షల సర్కార్ లోన్..మార్చి 17 నుంచి అప్లై చేసుకోండి

 నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రేపటి నుంచే తెలంగాణలో (మార్చి 17) రాజీవ్ యవ వికాసం దరఖాస్తులు తీసుకోనుంది ప్రభుత్వం. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్లు తీసుకోనుంది. ఏప్రిల్ 6 నుంచి మే31 వరకు దరఖాస్తులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేయనుంది ప్రభుత్వం. 5 లక్షల మంది యువతకు రూ 6 వేల కోట్లు ఇవ్వనుంది ప్రభుత్వం .దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. 

ఈ పథకం కింద ఎస్సీ,ఎస్టీ,బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం 3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వనుంది.  కేటగిరి 1,2,3 వారీగా రుణాలివ్వనుంది ప్రభుత్వం. కేటగిరీ 1 కింద రూ. లక్ష వరకు లోన్ 80 రాయితీ ఉంటుంది. కేటగిరి 2 కింద రూ.2లక్షల వరకు రుణం 70 శాతం రాయితీ, కేటగిరి 3 కింద రూ. 3 లక్షల లోపు రుణం 60 శాతం రాయితీతో ఇవ్వనుంది.

Also Read :- మరో నాలుగు రోజులు అవసరమైతేనే బయటకు రండి

జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్​ లిస్ట్​ను ​ప్రకటిస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన గైడ్​లైన్స్​ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్​ యువ వికాసం పథకం అమలు చేస్తే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.