వైసీపీ నేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణల వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు.
చిత్తూరు జిల్లా, పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని 75 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబం బినామీ పేర్లతో ఆక్రమించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ అటవీ భూములపైనే పవన్ విచారణకు ఆదేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు..? అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో సమగ్రంగా నివేదికలో పొందుపరచాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.
Also Read :- బ్యాంక్ మేనేజర్ తో పాటు 52 మంది అరెస్ట్
చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్రంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి @PawanKalyan.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 29, 2025
🔸సత్వరమే…