హైదరాబాద్ ఐఐఐటీ జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణలో 2030 నాటికి 2 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఖనిజ ఉత్పత్తుల కోసం ఐఐఐటీ హైదరాబాద్ తో .. సింగరేణి ఒప్పందం చేసుకోవడం సంతోషకరంగా ఉందంటూ... దేశ ప్రగతిలో ఐఐఐటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సంగారెడ్డిలో ఐఐఐటీ స్థాపించారని.. ఆయన విజన్ ఉన్న గొప్ప నాయకుడని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక దేవాలయాలు అయిన ఐఐటీలకి అంకురార్పణ చేశారని తెలిపారు.హైదరాబాద్ ఐఐటీ కొత్త ఆవిష్కరణలకు కేంద్ర బిందువు అయిందన్నారు. ఫ్లోటింగ్ సోలార్ పై తెలంగాణలో పెట్టుబడులు పెడతామన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారుస్తామన్నారు.