ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఉపాధి కల్పనకు నిధులు కేటాయించకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిందని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీవైఎఫ్ఐ సెంట్రల్ సిటీ కమిటీ అధ్వర్యంలో ఆదివారం బాగ్ లింగంపల్లి లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు.
వారు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ యువజన, విద్యార్థి వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్ ఉందన్నారు. డీవైఎఫ్ఐ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దామెర్ల హాష్మీబాబు, ఎండీ జావిద్, జిల్లా నాయకులు క్రాంతి, రాజయ్య, దేవేందర్, జావిద్, మహేశ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.