మీసేవల్లో దోపిడీని అరికట్టండి .. అడిషనల్ కలెక్టర్​కు డీవైఎఫ్ఐ వినతి

మీసేవల్లో దోపిడీని అరికట్టండి .. అడిషనల్ కలెక్టర్​కు డీవైఎఫ్ఐ వినతి

ముషీరాబాద్, వెలుగు: అప్లికేషన్ల పేరిట మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డీవైఎఫ్ఐ డిమాండ్ ​చేసింది. రేషన్ కార్డు దరఖాస్తులపై అధిక డబ్బులు వసూలు చేస్తున్న వారి చర్యలు తీసుకోవాలని కోరింది. శుక్రవారం హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ ముకుందా రెడ్డికి డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ కార్యదర్శి ఎండీ జావిద్ వినతిపత్రం అందజేశారు. 

రేషన్ కార్డు దరఖాస్తులపై రూ.50 వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. కొందరు ‘మీసేవ’ నిర్వాహకులు రూ.100 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి మీ సేవా కేంద్రాల గుర్తింపును రద్దు చేయాలని కోరారు.