
కొండారెడ్డిపల్లి, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బడంగ్ పేట మాజీ వైస్ చైర్మన్ చిగురింత నర్సింహా రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వెలువరించిన ‘డైనమిక్లీడర్’ పుస్తకాన్ని కొండారెడ్డిపల్లిలో సీఎం సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కాంగ్రెస్ లీడర్ దిండు శ్రీనివాస్ గౌడ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, సీనియర్ లీడర్రమేశ్ గౌడ్, వినోద్ నాయక్ పాల్గొన్నారు.