ఇంత దారుణమా:మీ ఉద్యోగాలు పీకేశాం..పెట్టాబేడా సర్దుకుని వెళ్లిపోండి..!

ఇంత దారుణమా:మీ ఉద్యోగాలు పీకేశాం..పెట్టాబేడా సర్దుకుని వెళ్లిపోండి..!

ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ భయం మరోసారి టెకీలను భయందోళనకు గురిచేస్తోంది.గత కొంత కాలంగా టెక్ ఉద్యోగుల తొలగింపులు తగ్గినప్పటికీ..తాజాగా సింగపూర్ కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ తన ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 

సింగపూర్ కు చెందిన డైసన్ కంపెనీ అకస్మాత్తుగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కొంత మంది ఉద్యోగులను తమ ఉద్యోగాలు వదిలి వెళ్లిపోండి అని కోరింది.అక్టోబర్ 1నుంచి స్కిల్ పరంగా డెవలప్ మెంట్ లేని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. 

ఉద్యోగ భదత్ర విషయంలో కంపెనీ ఉద్యోగులకు భరోసా ఇచ్చిన కొద్ది నెలలకే డైసన్ సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నామని చెప్పడంతో ఐటీ ఉద్యోగులను కలవర పెడుతోంది. ఇటీవల డైసన్ కంపెనీ యూకె బ్రాంచ్ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. 

‘‘కంపెనీ తన ఉద్యోగుల్లో కొంతమందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిందని..ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని చెబుతోందని’’ డైసన్ కంపెనీ ఎంప్లాయీ ఒకరు ఆందోళన చెందుతూ రాశారు.   

Also Read : సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షురూ

తొలగించిన కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చింది డైసన్ యాజమాన్యం. ఒక్కొక్కరితో సమావేశమై వారిని ఉద్యోగం వదిలి వెళ్లాలని నోటీసులిచ్చింది. మాన్యుఫ్యాక్చరింగ్, ప్రొక్యూర్ మెంట్ విభాగంగలోని ఎంప్లాయీస్ ఎక్కువగా లేఆఫ్స్ బారని పడ్డారని తెలుస్తోంది. ఎంతమంది ఉద్యోగులను తొలగించారు అనేదానిపై స్పష్టతలేదు. 

సింగపూర్ బ్రాంచ్ లో కంపెనీ పెట్టుబడులను పెంచుతున్నామని చెప్పింది.ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదని భరోసా ఇచ్చింది.. సడెన్ గా లేఆఫ్స్ ప్రకటించడంపై డైసన్ కంపెనీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.