Wonders of the World : ఈ రోడ్డు ప్రపంచానికి డెడ్ ఎండ్.. !

Wonders of the World : ఈ రోడ్డు ప్రపంచానికి డెడ్ ఎండ్.. !

రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడెన్గా రోడ్ ఎండ్ అయిపోతే ఎలా అనిపిస్తుంది? చాలా భయమేస్తుంది కదూ! మామూలు రోడ్డుకే అలా అనిపిస్తే మరి ప్రపంచమే ఎండ్ అయ్యే రోడ్డు ఒకటుంది. ఆ రోడ్డు మీద వెళ్తే ఇంకెలా అనిపిస్తుందో!

 ఈ రోడ్డు ప్రపంచంలోనే అత్యంత అందమైన, అద్భుతమైన రోడ్డు. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నంత సేపు ఆకాశంలోకి, చందమామ దగ్గరికి వెళ్తున్నట్లే ఉంటుంది. ఉత్తర ధృవానికి దగ్గర్లో ఉండే ఈ రోడ్డు నార్వేలో ఉంది. ఇక్కడికి వస్తే ప్రపంచయాత్ర ముగిసినట్లే.. అదే ఈ-69 హైవే. ప్రపంచానికే డెన్ఎండ్ చెప్పే రహదారి ఇది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాన్ని మిగతా ప్రపంచంతో కలిపే జాతీయ రహదారే ఈ- 69 రోడ్డు. ఈ రోడ్డు నార్త్ పోల్ కి దగ్గరగా అంటే.. ప్రపంచం ఎండ్ అయ్యే పాయింట్ వరకూ వెళ్తుంది. భూమిపై అంత చివర వరకూ వెళ్లే హైవే ఇది ఒక్కటే.

పదేండ్లు పట్టింది

 మంచుతో గడ్డకట్టిన ఈ ప్రాంతంలో ఓ హైవే నిర్మించాలని 1909లో అనుకున్నారు. కానీ ఈ-69 హైవే పూర్తయింది మాత్రం 1999లో పోల్స్ దగ్గర రోడ్డు వేయడం అంటే అంత ఈజీ కాదు. అందుకే ఈ రోడ్డుని 'ఇంజనీరింగ్ అద్భుతం' అంటారు. ఇది నార్వేలోని ఓల్డర్ ఫ్యోర్డన్న, నార్కాప్ ప్రాంతంతో కలుపుతుంది. శతాబ్దాల నుండి మానవ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వేరుగా ఉన్న ఎన్నో ప్రాంతాలను ఇది యూరపు కలుపుతుంది.

అద్బుతాలమయం

ఈ హైవేపై ప్రయాణిస్తే.. ప్రకృతికి ఉన్న రకరకాల రూపాలను చూడొచ్చు. దారి పొడవునా కనిపించే మంచు కొండలు తనలోకి తీసుకోడానికి ముందుకు వస్తున్నట్టు అనిపిస్తాయి. రోడ్డు వెంబడి ఎన్నో లోయలు, ఎత్తైన గుట్టలు కనిపిస్తాయి. ఈ-69 హైవేలో కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా నడపకూడదని రూల్ పెట్టారు. గుంపుగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. వందల కిలోమీటర్ల పాటు సముద్ర తీరంపైనే ఈ రహదారిపై వెళ్తుంటే పక్కనే ఉన్న చిన్న చిన్న గ్రామాలు సముద్రంలో కలిసిపోతున్నాయేమో అనే అనుభూతి కలుగుతుంది. 

ఉండేది వీళ్లే... 

ఈ హైవే ఎండ్ అయ్యే ప్లేస్ని నార్డికాప్ అంటారు. చలికాలం అయితే ఇక్కడి వాతావరణం చెప్పనవసరంలేదు. నార్త్ పోల్ అంతా చలితో కప్పుకుపోతుంది. దాంతో ఈ రోడ్డుకూడా దాదాపుగా మంచులో మునిగిపోతుంది. భూమికి పూర్తిగా ఉత్తరంగా ధృవం దగ్గరకు వెళ్లడమంటే దాదాపు చంద్రుడి దగ్గరకు వెళ్లొచ్చినట్టే. ఈ ప్రాంతం ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వేసవికాలంలో సూర్యుడు అస్తమించడు. అలాగే చలికాలంలో ఉదయించడు, చలికాలం అంతటా చీకటే ఉంటుంది. ఉత్తర ధృవం దగ్గర నివసించే వాళ్లకు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. వందల ఏళ్ల నుంచి వాళ్లు అలానే జీవిస్తున్నారు. వీళ్లంతా సముద్రంలోని చేపలు, పీతలు వంటి వాటిని పట్టుకుని బతుకుతుంటారు.

చివరి అంచున..

ఈ రోడ్డు వెంట దట్టమైన దేవదారు చెట్లు, రెయిన్ డీర్లు కనిపిస్తుంటాయి. ఈ రోడ్డు డెడ్ండ్కు వెళ్తే చివరకి సముద్రం కనిపిస్తుంది. ఈ డెడెండ్ దగ్గర ఓ సొరంగం కూడా ఉంది. దాన్ని సముద్రంలో నిర్మించారు. ఇది మెగెరోయా అనే ఐలాంట్ని కలుపుతుంది. ఈ డెడ్అండ్ దగ్గర భూమిలోపల ఒక చర్చి, మ్యూజియం కూడా ఉన్నాయి. ఒకప్పుడు హైవేపై ఇక్కడికి వచ్చినవారు అక్కడితో తమ ప్రపంచయాత్ర ముగిసిందని భావించేవారు. ఈ -69 రహదారి ప్రతి ప్రయాణానికి ఒక అంతం ఉంటుందని చెబుతుంది.

చేపలు ఫేమస్

ఈ ఏరియా చేపలకు చాలా ఫేమస్. వందల ఏళ్ల నుంచి వేరే దేశాల నుంచి జాలర్లు చేపల వేటకు ఇక్కడికి వచ్చేవాళ్లు. ఇక్కడ నుంచి చేపలు మర్చిపోలేనిది  అట్లాంటిక్ సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ దారి వెంట ప్రయాణం ఎన్నో మధురానుభూతులను అందిస్తుంది. ప్రయాణంలో కొంచెం థ్రిల్ కావాలంటే సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు వెళ్లాలి.. అలలు అంత ఎత్తున లేచి రోడ్డుపై పడుతుంటే ఎవరికైనా భయం పుట్టాల్సిందే.. ఈ రోడ్డుమీద ప్రయాణిస్తున్నప్పుడు 'సముద్రంలోకి దారి నిర్మించారా?' అన్న భావన కలుగుతుంది.

 దగ్గరకు వెళ్లే దాకా ముందు రోడ్డున్న సంగతి తెలీదు. ఈ రోడ్డు మీద వెళ్తున్నంత సేపు సముద్రంలో ఊయల ఊగుతున్నట్టు ఉంటుంది. ఐస్ ప్యాక్ అయ్యి చైనా వరకూ వెళ్తాయి. ఈ ప్రాంతంలో దొరికే కింగ్ పీతలు వరల్డ్ ఫేమస్. ఇక్కడ రేవుల్లో రంగురంగుల పడవలు కనిపిస్తాయి. చలికాలంలో కాడ్ చేప, స్ప్రింగ్ సీజన్లో సాల్మన్, కోల్ ఫిష్ వానాకాలంలో హేడాక్ అనే చేపలు బాగా దొరుకుతాయి.

మరొకటుంది

ఇలాంటిదే నార్వేలో మరో రోడ్డు ఉంది. అదే 'అట్లాంటిక్ ఓషన్ రోడ్డు", ఇది అట్లాంటిక్ మహా సముద్రం మీద కట్టిన బ్రిడ్జి హైవే. నార్వేలో క్రిస్టియన్ సండ్, మోల్డ్ అనే రెండు ప్రాంతాలను కలుపుతుంది. ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన హైవేల్లో ఒకటి. మామూలుగా వర్షాకాలంలో రోడ్డుపై ఉండే నీటిలోంచి వెళ్లాలంటేనే మనకు ధైర్యం చాలదు. అలాంటిది ఈ రోడ్డుపై 24 గంటలు సముద్రపు అలలు కొన్ని మీటర్ల ఎత్తకు లేచి రోడ్డు మీద పడుతుంటాయి. బ్రిడ్జి ఎంతో ఎత్తులో ఉంటుంది. అయినప్పటికీ అలలు బ్రిడ్జికి ఒకవైపు నుంచి మరో వైపుకు ఎగిసి పడుతుంటాయి.

రకరకాలుగా..

ఈ రోడ్డుని దూరం నుంచి ఒక కోణంలో చూస్తే... ఫ్లైఓవర్ మొదలు పెట్టి ఆపేసినట్టు కనిపిస్తుంది. 'పొరపాటున వెళితే కింద నీళ్లలో పడిపోతాం' అనిపిస్తుంది. ఇంకో కోణంలో చూస్తే సముద్రం మీద పెద్ద పాములా అనిపిస్తుంది. అన్ని వంకరటింకర్లతో ఉంటుంది. రోడ్డు. అందుకే దీన్ని 'ద డ్రంక్ బ్రిడ్జ్' అని కూడా పిలుస్తారు. మామూలు టైమ్లో కొంచెం పరవాలేదు గానీ.. వాతావరణం అనుకూలించనప్పుడు మాత్రం ఆ రోడ్డుమీద వెళ్లడమంటే పెద్ద సాహసమే.. పక్కనే అట్లాంటిక్ మహాసముద్రం.. మధ్యలో రోడ్డు... ఇంకేముంది.. భారీ అలలు, పైగా సముద్రపు అలల వల్ల రోడ్డంతా ఎప్పుడూ తడిసి ఉంటుంది. ప్రపంచంలో ముఖ్యమైన హాలిడేరోడ్ ట్రిప్స్ ఇదొకటి. హాలిడే రోడ్ ట్రిప్ కోసం వేల సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు.