హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు.. పూర్తిగా దగ్ధం

హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బైకులో మంటలు చెలరేగాయి. శనివారం ( సెప్టెంబర్ 28, 2024 ) ఉదయం కుత్బుల్లాపుర్ లోని సూరారం చౌరస్తా దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటన. ఎలక్ట్రిక్ బైకును ఛార్జ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలక్ట్రిక్ బైకు పూర్తిగా దగ్దమవ్వగా... పక్కనే ఉన్న మెడికల్ షాపు పాక్షికంగా దగ్దమైంది. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఒక్కసారిగా బైకులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయబ్రాంతులకు గురయ్యారు.మెడికల్ షాపు ముందే బైకు దగ్దమవ్వటంతో షాపు ముందు భాగం పాక్షికంగా దగ్దమయ్యింది. స్థానికుల సమాచారం అందించటంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.