ఈ–బైక్​ బ్యాటరీ పేలి.. జర్నలిస్టు మృతి

అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఘటన జరిగింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నిస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. 27 ఏళ్ల ఫాజిల్‌ ఖాన్‌ జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసేందుకు 2020లో న్యూయార్క్‌ వెళ్లాడు. అక్కడి కొలంబియా జర్నలిజం స్కూల్‌లో కోర్సును పూర్తి చేశాడు. నాటి నుంచి అక్కడే ఉంటున్నాడు.  

తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ ఎలక్ట్రికల్‌ బైక్‌లోని లిథియం అయాన్‌ బ్యాటరీలో మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించి భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసింది. ప్రమాదంలో పాజిల్‌ ఖాన్‌ మృతి చెందాడు. కొందరు కిటికీలో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ప్రమాదంపై భారత కార్యాలయం స్పందించింది. ఫాజిల్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబం, స్నేహితులతో టచ్‌లో ఉంటున్నామని.. మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజురోజుకి పెరిగిపోతున్న ఇంధన ధరలతో వాహనదారులు విలవిలలాడిపోతున్నారు. దీంతో అంతా ప్రత్యామ్నాయలపై దృష్టి పెట్టారు. పెట్రోల్ (Petrol), డీజిల్ (Desiel)కొనే పని లేని వాహనాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ లను కొనుగోలు చేస్తున్నారు. వీటికి ఫ్యూయల్ అవసంర లేదు. ఛార్జింగ్ పెడితే చాలు. దీంతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ బైక్ (Electric) లకు ఆదరణ పెరిగింది. ఇటీవలి కాలంలో వీటి సేల్స్ విపరీతంగా పెరిగాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ బైక్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. బాంబుల్లా పేలిపోతున్నాయి. బ్యాటరీలో మంటలు చెలరేగి కాలిపోతున్నాయి. వీటి కారణంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి.