హైదరాబాద్లో ఈ నెల 15 నుంచి ప్రారంభానికి ఏర్పాట్లు
అప్లికేషన్ మొదలు అప్రూవల్ దాకా ఆన్లైన్లోనే..
గతంలోనే స్టార్ట్ చేసినా ఇంప్లిమెంట్ చెయ్యలే
కరోనాతో ఇప్పుడు మస్ట్
హైదరాబాద్,వెలుగు: హైదరాబాద్ కలెక్టరేట్లో ఈ-ఆఫీస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 15 నుంచి అన్ని డిపార్ట్మెంట్లలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే సిటీ పరిధిలోని 2 ఆర్డీఓ, 16 తహసీల్దార్ ఆఫీసులను ఈ సిస్టమ్ కి అనుసంధానం చేయనున్నారు. త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ–ఆఫీస్ అంటే.. గవర్నమెంట్ ఆఫీసుల్లో సేవలను ఈజీ చేసేలా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎన్ఐసీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అప్లికేషనే ఈ– ఆఫీస్. పరిపాలనలో పారదర్శకత, ప్రజలకు జవాబుదారీ ఉంటుంది. నాలుగేండ్ల కిందటే జిల్లాలో ఈ–ఆఫీస్ అమలు చేశారు. పూర్తిస్థాయిలో సేవలు అమలు చేయడం సాధ్యం కాలేదు. కరోనా కారణంగా ప్రస్తుతం మస్ట్ అయ్యాయి. పేపర్లు,ఫైల్స్ ద్వారా కూడా వైరస్ సోకుతుండగా ఈ దిశగా ఆలోచన చేశారు.
పేపర్ వర్క్ ఉండదు
ఈ–ఆఫీస్ ద్వారా పేపర్ వాడకం పూర్తిగా తగ్గుతుంది. ఒక ఫైల్ ను స్కాన్ చేసి ఆన్లైన్ లో ట్రాన్స్ ఫర్ కోసం టెక్నికల్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సెక్షన్ సిబ్బందికి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ కేటాయిస్తున్నారు. ఇన్ వార్డు మొదలు జిల్లా ఉన్నతాధికారి వరకు ఈ పైలింగ్ కు ఏర్పాట్లు
చేస్తున్నారు. సెక్షన్ సిబ్బంది లేదా అధికారి పరిశీలించి ఫైల్ ను ఆఫీస్ సూపరింటెండెంట్ కు ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆయన చెక్ చేసి అడిషనల్ కలెక్టర్ లాగిన్ కు పంపిస్తారు. అక్కడి నుంచి ఆ ఫైల్ కలెక్టర్ లాగిన్ కు వెళ్తుంది. కలెక్టర్ పరిశీలించి అన్ని కరెక్ట్ గా ఉంటే అప్రూవల్ ఇస్తారు. లేదటే వెనక్కి పంపిస్తారు.
For More News..