హైదరాబాద్ లో ప్లిప్ కార్ట్ గ్రీన్ డేటా సెంటర్

హైదరాబాద్‌‌, వెలుగు: మనదేశంలో అతిపెద్ద ఈ కామర్స్‌‌ కంపెనీ ఫ్లిప్‌ ‌కార్ట్‌‌  హైదరాబాద్‌ లో సోమవారం పర్యావరణ అనుకూల గ్రీన్ డేటా సెంటర్‌ ను ఏర్పాటు చేసింది. టెక్నాలజీ వసతులను పెంచడానికి మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. కంపెనీకి ఇది దేశంలోని రెండో డేటా సెంటర్‌ కాగా, హైదరాబాద్‌ లో మొదటిది.తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శిజయేశ్‌ రంజన్‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ గ్రూప్‌‌ చీఫ్‌ కార్పొరేట్‌అఫైర్స్‌‌ ఆఫీసర్‌ రజనీశ్‌ కుమార్‌ ఈ డేటా సెంటర్‌ ను ప్రారంభించారు. ఐటీ కంపెనీ ‘కంట్రోల్‌ ఎస్‌ ’ భాగస్వామ్యంతో దీనిని నిర్మించారు. కంపెనీ సీఈఓ పిన్నపురెడ్డి శ్రీధర్‌ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.ఇండియాలోనే అత్యంత భారీ క్లౌడ్‌ డేటా సెంటర్లలో ఇదొకటి. వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని, మరింత మంది సెల్లర్లను, ఎంఎస్‌ఎమ్‌ఈలను ఫ్లిప్‌‌కార్ట్‌‌లో చేర్చుకోవడానికి వీలవుతుందని కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు. మరింత మంది కస్టమర్లనూ ఆకర్షించవచ్చని చెప్పారు. మరో విశేషం ఏమిటంటే దీనికి సాధారణ కరెంటును కాకుండా సోలార్ విద్యుత్‌వంటి పునరుత్పాదక ఇంధనాన్ని వాడుతారు.మనదేశంలో అత్యధికంగా విద్యుత్‌ ను పొదుపుచేసే డేటా సెంటర్లలో ఇదీ ఒకటి. ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ ఇండియాలో డేటాసెంటర్ల కోసం తొలిసారిగా ఒక విధానాన్నితయారు చేసినది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే.దీనివల్ల అద్భుత ఫలితాలు వస్తున్నాయి. అందుకే ఫ్లిప్‌‌కార్ట్‌‌ వంటి కంపెనీలు తెలంగాణకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి. టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ను మెరుగుపర్చేందుకు ఇక్కడి ప్రభుత్వం తీసుకున్నచర్యలు యువతకు మంచి భవిష్యత్‌ ను అందిస్తున్నాయి’’ అని అన్నారు. ఈ డేటా సెంటర్‌ కు ఇంటెలిజెంట్‌ పవర్‌ , కూలింగ్‌‌, క్రిటికల్‌ కంప్యూటింగ్‌‌,స్టోరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌, మెషీన్‌ లెర్నింగ్‌‌ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.