టెక్ యుగంలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ఆన్ లైన్ గేమ్స్ లు పెరిగాయి. కష్టపడకుండా ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ ఆడితే చాలు..గెలిస్తే డబ్బు లు మీసొంతం అంటూ..యూజర్లను ఆకట్టుకుంటుండటంతో చిన్నా పెద్ద తేడా లేకుండా చాలా మంది ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడ్డారు. ఇందులో సంపాదించేది కొందరైతే .. నమ్మి డబ్బు పెట్టి నష్టపోయేవారు ఎందరో.. అటువంటి ఈ ఆన్ లైన్ గేమ్ లపై అప్పట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ కూడా నిబంధనలు ప్రకటించింది. అయితే తాజాగా గేమింగ్ ఇండస్ట్రీ బాడీ అయిన ఈ-గేమింగ్ ఫెడరేషన్ (EGF) బాధ్యతాయుతమైన గేమింగ ను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆటగాళ్ల రక్షణకు కట్టుబడి, సమాఖ్య బాధ్యతయుతమైన గేమింగ్ పద్దతుల గురించి అవగాహణ కల్పించడం , ఆటగాళ్లకు సురక్షితమైన వాతావరణం పెంపొం దించడం లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకుంది. ఆన్ లైన్ లో ఆడుతున్నప్పుడు మంచి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంతో యువతకు అవగాహన కల్పించ డానికి చొరవ చేపట్టామని తెలిపారు.
ముంబైలో రెండు ఆన్ లైన్ గేమింగ్ యూనికార్న్ లతో భారత దేశంలోని మొదటి మూడు ఆన్ లైన్ గేమింగ్ రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి. బాధ్యతాయుతమైన గేమింగ్ ప్రవర్తనను పెంపొందించేందుకు నాలెడ్జ్, పరికరాలతో ఆటగాళ్లను బలోపేతం చేయడానికి సోషల్ ఐట్రీచ్ ప్రచారం ఆవశ్యకతను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గుర్తించి ప్రోత్సహిస్తున్నారు.
ఆన్లైన్ గేమింగ్ లపై డాక్టర్లు స్పందిస్తూ బాధ్యతారహితమైన గేమింగ్ వల్ల ఏకాగ్రత తగ్గుతుందని, సులువుగా కోపం, చిరాకు రావడం, దీర్ఘకాలిక ఆందోళన , డిప్రెషన్ కు దారి తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.