రెండు బ్యాటరీలతో ఈ–స్కూటర్..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కి.మీల ప్రయాణించొచ్చు

రెండు బ్యాటరీలతో ఈ–స్కూటర్..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కి.మీల ప్రయాణించొచ్చు

హైదరాబాద్, వెలుగు: న్యూమెరస్ మోటర్స్ గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తమ మల్టీయుటిలిటీ ఎలక్ట్రిసిటీ స్కూటర్ డిప్లోస్ మాక్స్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేసింది. ఇందులో 3.7 కిలోవాట్ల సామర్థ్యం గల రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒక్కసారి  చార్జ్​ చేస్తే 140 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 

బండిపై ఐదేళ్ల వరకు వారంటీ వస్తుంది.  డిప్లోస్ మాక్స్  హైదరాబాద్ ఎక్స్​–షోరూం ధర రూ. 1,12,199. జూన్​లోనూ మరో స్కూటర్​ను లాంచ్​ చేస్తామని కంపెనీ ప్రకటించింది. వీటిని మంగళూరులోని తమ ప్లాంటులో తయారు చేస్తున్నామని తెలిపింది.