ఈ–వీసాల జారీని మళ్లీ ప్రారంభించిన ఉక్రెయిన్

ఈ–వీసాల జారీని మళ్లీ ప్రారంభించిన ఉక్రెయిన్

కీవ్: ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశం, భూటాన్, మాల్దీవులు, నేపాల్‌‌ సహా 45 దేశాల పౌరులకు ఎలక్ట్రానిక్ వీసాలు (ఈ–వీసాలు) జారీ చేయడాన్ని తిరిగి ప్రారంభించింది. డిపార్ట్‌‌మెంట్ జనరల్ ఫర్ కాన్సులర్ సర్వీస్ ఈ నెల 19 నుంచి దరఖాస్తులను ప్రాసెస్ చేస్తోంది. దీని ద్వారా అర్హత కలిగిన ప్రయాణికులు పర్యాటకం, వ్యాపారం, విద్య, సాంస్కృతిక, శాస్త్రీయ కార్యకలాపాలు, జర్నలిజం, క్రీడలు, వైద్య చికిత్స వంటి వివిధ ప్రయోజనాలకు ఈ–-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నది. ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రకారం.. యూఎస్​డీ 20 ధరకు సింగిల్-ఎంట్రీ వీసా, యూఎస్​డీ 30 ధరకు డబుల్-ఎంట్రీ వీసా అందిస్తోంది.