![అంబేద్కర్ కాలేజీలో ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్](https://static.v6velugu.com/uploads/2022/10/E-Waste-Collection-Drive-Program-In-DR.B.-R-.Ambedkar-College_PAKVNJs9TO.jpg)
ముషీరాబాద్, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా లేటెస్ట్ పరికరాలు వస్తుంటే పాత వాటిని పక్కన పెట్టడం సాధారణమే. కానీ వీటితో పర్యావరణానికి ముప్పు ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పాడైపోయిన కంప్యూటర్లు, కీబోర్డ్, సెల్ ఫోన్స్, ఫర్నిచర్స్ ఇతరత్రా వస్తువులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. పాడైపోయిన వస్తువులను రీసైక్లింగ్ చేయడానికి ఎర్త్ సెన్స్ రీసైకిల్ ప్రైవేట్ లిమిటెడ్ చారిటబుల్ ట్రస్టు లాంటివి ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాగ్ లింగంపల్లి
లోని అంబేద్కర్ విద్యాసంస్థల ఆవరణలో ఎర్త్ సైన్స్ రీ సైక్లింగ్ ట్రస్టు ఈ - వేస్ట్ కలెక్షన్ డ్రైవ్‌ను చేపట్టింది.
డిగ్రీ, లా, ఎంబీఏ కాలేజీలో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్, హార్డ్ డిస్క్, ప్రింటర్స్, చెయిర్లు, ఫర్నిచర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను శుక్రవారం విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ ఎర్త్ సైన్స్ ట్రస్టుకు డొనేట్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. కాలేజీలో నిరుపయోగంగా ఉన్న ఈ -వేస్ట్‌ను తిరిగి వాడేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ-వేస్ట్‌ను డొనేట్ చేయాలి నిరుపయోగంగా ఉన్న, పాడైన ఎలక్ట్రానిక్స్ వస్తువులను రీ సైక్లింగ్ చేయడం ద్వారా అవి మరొకరికి ఉపయోగపడ తాయనే ఉద్దేశంతో కాలేజీలోని ఈ-వేస్ట్ ను ఎర్త్ సైన్స్ ట్రస్టుకు డొనేట్ చేశాం. ఈ-వేస్ట్ అత్యధికంగా పేరుకపోతే పర్యావరణానికి హాని కలుగుతుంది. అందుకే ఈ-వేస్ట్‌ను డొనేట్ చేయాలి.
- వివేక్ వెంకటస్వామి,
అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్,
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు
పర్యావరణానికి మేలు
పేరుకుపోయిన ఈ-వేస్ట్‌ను కలెక్ట్ చేసి రీసైక్లింగ్ తర్వాత వాటిని మళ్లీ ఉపయోగిస్తాం. ఎక్కువగా ఈ-వేస్ట్ నిల్వ చేస్తే పర్యావరణానికి ముప్పు తప్పదు. అందుకే అంబేద్కర్ విద్యా సంస్థలు ఎక్కువ మొత్తంలో ఈ-వేస్ట్‌ను డొనేట్ చేశాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో 2008లో తమ ట్రస్టు ద్వారా రీసైక్లింగ్ కంపెనీ మహేశ్వరంలో ప్రారంభించాం. అప్పటి నుంచి ఈ-వేస్ట్ ను కలెక్ట్ చేస్తున్నాం.
- డొనాల్డ్, ఎర్త్ సైన్స్ రీ సైక్లింగ్ ట్రస్టు ప్రతినిధి