AP News: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం:  మంత్రి నిమ్మల

AP News: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం:  మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. తల్లికి వందనం  స్కీమ్‌కు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ కిట్ విషయంలో మంత్రి నిమ్మల రామానాయుడు   క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనం పేరుతో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థికి  ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి తెలిపారు.  ఇంకా ఈ  పథకం  అమలు కాకముందే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని నిమ్మల తీవ్రసాయిలో ఫైర్ అయ్యారు. వాటిని ఏపీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాషంలోని ప్రతి విద్యారికి రూ. 15 వేలు ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. 

ALSO READ | కాళ్లకు దండం పెట్టొద్దు.. పెడితే తిరిగి పెడతా: సీఎం చంద్రబాబు

తల్లికి వందనం పథకానికి సంబంధించి… దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తల్లులు లేదా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే వారికి రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.  విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బ్యాగ్‌, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌, ఇంగ్లిష్‌ డిక్షనరీ, మూడు జతల యూనిఫాం, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్స్‌లను విద్యార్థి కిట్‌ కింద అందజేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.