ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు చాలా స్వచ్ఛంద సంస్థలు పని చేస్తుంటాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాటితో కలిసి పని చేస్తాయి. అలానే సోని కంపెనీ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ నియంత్రనకు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ‘సోనీ లింక్ బడ్స్ ఎస్ ఎర్త్ బ్లూ’ పేరుతో, వేస్ట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తో చేసిన ఇయర్ బడ్స్ ని లాంచ్ చేసింది.
భూమి, సముద్రం అని తేడాలేకుండా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ గుట్టులు పేరుకు పోతున్నాయి. రీ సైకిల్ ప్లాంట్స్ ఉన్నా, పూర్తి స్థాయితో ప్లాస్టిక్ రీ సైకిల్ జరగడంలేదు. అందుకని సోనీ ఇకనుంచి తను తయారుచేయబోయే ప్రతీ చిన్న గాడ్జెట్ ప్లాస్టిక్ వేస్ట్ తో తయారుచేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కి ‘రోడ్ టు జీరో’ అని పేరు పెట్టింది. 2050 కల్లా ప్లాస్టిక్ ఫ్రీ ఎర్త్ గా తయారుచేయాలన్నది ప్రాజెక్ట్ ఉద్దేశం. ఇన్ ఇయర్ టైప్ లో వచ్చే ఇయర్ బడ్స్ ఎన్విరాన్ మెంటల్ నాయిస్ క్యాన్సలైజేషన్, యాక్టివ్ నాయిస్ క్యాన్సలైజేషన్ తో వస్తాయి. డాల్బీ ఆట్మోస్, వాటర్ రెసిస్టెంట్, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఉంటుంది. రెండు గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతాయి. వీటి ధర రూపాయలు. 16,500.