ఢిల్లీలో వర్ష బీభత్సం

ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిపింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. ఈదురు గాలులతో కూడిన వాన కురవడంతో వాహనదారులు, మార్నింగ్ వాకర్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంతో పాటు చలిగాలులు వీయడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడలేదు. ఒకరోజు ముందుగానే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాన పడుతుందని ఐఎండీ అంచనా వేసింది. అనుకున్నట్టుగా దేశ రాజధానిలో భారీ వర్షం కురిసింది. 

మరిన్ని వార్తల కోసం

1477కేజీల గంజాయిని కాల్చివేశారు

అమ్రోహా ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత