సిద్దిపేట, వరంగల్ జిల్లాలో ఇవాళ(మే 5)మంత్రి కేటీఆర్ పర్యటన సందర్బంగా ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. కేటీఆర్ ను అడ్డుకుంటారనే ఉద్దేశంతో సిద్దిపేటలో బీజేపీ, సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
గ్రేటర్ వరంగల్ లో ఉదయం నుంచే బీజేపీ, పలు సంఘాల నేతలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను అరెస్ట్ చేశారు పోలీసులు. బీజేపీ 4వ డివిజన్ అధ్యక్షుడు గొర్రె ఓం ప్రకాశ్ యాదవ్, AIYF రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రిని అదుపులోకి తీసుకున్నారు హనుమకొండ పోలీసులు. 46 డివిజన్ అధ్యక్షుడు ముత్తోజు సురేష్, జిల్లా నాయకులు గడ్డం మహేందర్ ను అరెస్టు చేసి మడికొండ పీఎస్ కు తరలించారు.
హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు కేటీఆర్. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు హనుమకొండకు వెళతారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ తో పాటు 181 కోట్ల 45 లక్షలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు, శంకుస్థాపనలు చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు కాజిపేట్ లోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.