- రాష్ట్ర స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ
కొడంగల్, వెలుగు: దివ్యాంగులను గుర్తించే సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పేర్కొన్నారు. రాష్ర్ట సర్కార్ చేపట్టే దివ్యాంగుల సర్వేకు వికారాబాద్ జిల్లా బొంరాస్ పేటను పైలట్ప్రాజెక్ట్ గా ఎంపిక చేసింది. బుధవారం వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, అంగన్వాడీ, ఆశ వర్కర్స్, ఎంఎల్హెచ్పీ సూపర్వైజర్లకు అవగాహన కల్పించగా .. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె పలు సూచనలు చేశారు.
ఇంటింటి సర్వే చేసి ప్రతి బిడ్డను క్షుణంగా పరిశీలించాలని తెలిపారు. ఆరేండ్లలోపు పిల్లల్లో వైకల్యం ముందుగా గుర్తిస్తే చికిత్సతో నయం చేయొచ్చన్నారు. సర్వే ద్వారా నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని వికారాబాద్కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. ప్రభుత్వ బడులు, అంగన్వాడీ కేంద్రాలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అసిస్టెంట్ కలెక్టర్ఉమా హారతి, డీఎంహెచ్ఓ పల్వన్కుమార్, డీఐఓ బుచ్చిబాబు, డాక్టర్ రవీందర్యాదవ్ తదితరులు ఉన్నారు.