Good Health : పరకడుపున టీ, కాఫీలు అస్సలు తాగొద్దు.. అలా తాగితే ఏమవుతుందో తెలుసా..!

Good Health :  పరకడుపున టీ, కాఫీలు అస్సలు తాగొద్దు.. అలా తాగితే ఏమవుతుందో తెలుసా..!

చాలామంది ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీలను తాగుతుంటారు. ఉదయం మంచిదే అయినా, పరకడుపున తాగడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరకడపున తాగడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయి. కాబట్టి ఒక గ్లాస్ మంచి నీటిని తాగిన తర్వాతే కాఫీ, టీలు తీసుకోవాలి. ఘాటైన మసాలా కూరలను కూడా పరగడుపున తినకూడదు. అలా తింటే పొట్టలో తిప్పడమేకాక, రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎక్కవ కాలం కొనసాగితే అల్సర్ వస్తుంది.

Also Read : పండుగులకు.. ప్రకృతికి సంబంధం ఏంటీ

ఉదయం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఖాళీ కడుపుతో పుల్లని పదార్ధాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. పండ్లను కూడా తినడం అంతమంచిది కాదు. అందులోనూ అరటిపండ్లకు దూరంగా ఉండాలి. అరటిలోఉండే  మెగ్నీషియం శరీరానికి హానిచేస్తుంది. శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణాశయంలో హాని చేసే కొన్ని ఆమ్లాలు విడుదలవుతాయి. వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.


-వెలుగు, లైఫ్-