సంగారెడ్డి జిల్లాలో ముందస్తు సంక్రాంతి సంబురాలు

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లాలో పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​వర్సిటీలో సంక్రాంతి సంబురాలు ఉత్సాహంగా జరిగాయి. శుక్రవారం వర్సిటీ క్యాంపస్​లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయ అలంకరణ, ఆటపాటలతో స్టూడెంట్స్​, అధ్యాపకులు వేడుకను జరుపుకున్నారు. రంగోలి, ఎద్దుల బండ్లు, రుచికరమైన వంటకాలు, పొంగల్​ స్పెషల్​ ఐటమ్స్​ను అరటి ఆకులో వడ్డించడం, గాలి పటాలు ఎగరవేయడం, తదితర కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. కార్యక్రమంలో గీతం స్టూడెంట్ లైఫ్ డిప్యూటీ డైరెక్టర్​అంబికా ఫిలిప్, గీతం ప్రతినిధులు, అన్ని బ్రాంచీల అధికారులు, స్టూడెంట్స్​ పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న రంగవల్లులు

సిద్దిపేట: సంక్రాంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో వివిధ స్కూళ్లలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. శుక్రవారం స్థానిక సెలెస్టీయల్‌‌ ఇంగ్లిష్‌‌ మీడియం హైస్కూల్‌‌లో స్టూడెంట్స్​వేసిన రంగవల్లులు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డైరెక్టర్లు వై.హన్మంతరెడ్డి, బి.శ్రీనివాస్‌‌రెడ్డి, ప్రిన్సిపాల్‌‌ ఏఆర్‌‌ఆర్‌‌ కృష్ణమాచారి, స్కూల్​టీచర్లు పాల్గొన్నారు.

చిన్నశంకరంపేట: చిన్న శంకరంపేట మండలం చందాపూర్​ ప్రైమరీ స్కూల్​లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులతో ముగ్గులు వేయగా, హరిదాసు వేషధారణ,  భోగిమంటలతో ఆకట్టుకున్నారు. హెచ్​ఎం పరమేశ్వర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లావణ్య, అంగన్వాడీ టీచర్​స్వప్న, విద్యార్థులు పాల్గొన్నారు. పాపన్నపేట మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో సైతం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.