కాకా అంబేద్కర్ విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీ విద్యాసంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాకల్టీ. హరిదాసు వేషధారణతో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబురాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు డైరెక్టర్ విష్ణు ప్రియ, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శేఖర్. విద్యార్థులతో కలిసి పండగని సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

 కాలేజీలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగరవేయడం అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు స్టూడెంట్స్. ప్రతీసారి ఇంటి దగ్గర పండుగను చేసుకునేవాళ్ళం ఇప్పుడు కాలేజీలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఉపాధ్యాయులు.

 అంబేద్కర్ విద్యాసంస్థల్లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ లో విద్యార్థులు, టీచర్లు, లెక్చరర్స్ పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సెట్, హరిదాసుల వేషాలు, ముగ్గులు, పతంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.