సిద్దిపేట లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

సిద్దిపేట లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

సిద్దిపేట రూరల్, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిద్దిపేట నియోజకవర్గ ఇన్​చార్జి దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట హైస్కూల్ గ్రౌండ్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల ముగ్గులు, వాటిపై గొబ్బెమ్మలు, బోగిమంటల చుట్టూ నృత్యాలు, సంక్రాంతి విద్యార్థుల వేషాలు, గంగిరెద్దుల ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి. 

పిండి వంటలు చేసి ప్రదర్శించారు. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వెంకట్, మానస, పద్మ, తులసి, హారిక, స్వప్న, అనిత, కల్యాణి, శిరీష, రాధిక పాల్గొన్నారు.