సిప్ తొందరగా చేస్తేనే ఎక్కువ లాభాలు 

సిప్ తొందరగా చేస్తేనే ఎక్కువ లాభాలు 
  • మార్కెట్ పడేంత వరకు వెయిట్ చేయొద్దంటున్న వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • రిటర్న్ రేట్‌‌ ఎక్కువగా ఉన్నా, లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ ప్రయోజనం కనిపించదని సలహా
  • గత 27 ఏళ్ల హిస్టరీ లెక్కలు బయటపెట్టిన  రిపోర్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: చాలా మంది ఇన్వెస్టర్లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్ (సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ప్రారంభించాలని అనుకుంటారు. లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంపద పెంచుకోవడానికి ఇదే బెస్ట్ ఛాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బావిస్తారు. కానీ, మార్కెట్ పెరుగుతున్నప్పుడు సిప్ మొదలు పెట్టాలా? లేదా కరెక్షన్ వచ్చాక మొదలు పెట్టాలా? అని ఆలోచిస్తుంటారు. మ్యూచువల్ ఫండ్ కంపెనీ వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్ ఏఎంసీ విడుదల  చేసిన రిపోర్ట్ ప్రకారం, సిప్ వీలున్నంత తొందరగా ప్రారంభించడం మంచిది. మార్కెట్ పడేంత వరకు వెయిట్ చేసి, తర్వాత సిప్ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే  వచ్చే లాభాలు తగ్గిపోతాయి. బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ సెన్సెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ (టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) గతంలో 20 శాతానికి పైగా పడక ముందు, పడిన తర్వాత మొదలు పెట్టిన సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఈ ఏడాది జూన్ 31  నాటికి  ఎంత లాభాలిచ్చాయో వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓక్ వివరించింది.

ఉదాహరణకు మొదటి ఇన్వెస్టర్ మార్కెట్ పడక ముందు సిప్ స్టార్ట్ చేస్తే, రెండో ఇన్వెస్టర్ మార్కెట్ పతనం తర్వాత సిప్ మొదలు పెట్టాడని అనుకుందాం.  మొదటి ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నెలకు రూ.10 వేల చొప్పున 2008 జనవరిలో సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలు పెట్టాడు.  ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సెన్సెక్స్ టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ 25,756 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర ఉంది. అదే మార్చి, 2009 నాటికి 60 శాతానికి పైగా పతనమై 10,216 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగొచ్చింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన విషయం తెలిసిందే.

మొదటి  ఇన్వెస్టర్ ఈ ఏడాది జూన్ నాటికి 16 ఏళ్ల ఆరు నెలలు సిప్ చేస్తారు. అంటే మొత్తం రూ.19.9 లక్షలు ఇన్వెస్ట్ చేసేవారు. అదే 14 నెలల  పాటు జరిగిన కరెక్షన్ తర్వాత సిప్ మొదలు పెట్టిన రెండో ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  15 ఏళ్ల నాలుగు నెలల పాటు నెలకు రూ.10 వేల చొప్పున సిప్ చేస్తారు. మొత్తం రూ.18.5 లక్షలు ఇన్వెస్ట్ చేసేవారు. ఈ ఏడాది జూన్ 31 నాటికి  మొదటి ఇన్వెస్టర్ పోర్టుఫోలియో విలువ రూ.74.7 లక్షలకు పెరగగా, రెండో  ఇన్వెస్టర్ పోర్టుఫోలియో విలువ రూ.63.8 లక్షలకు చేరుకుంటుంది. రెండో ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదటి ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  రూ. 10.9 లక్షల లాభాన్ని కోల్పోయేవారు. మొదటి ఇన్వెస్టర్ కంటే  రెండో ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం విలువ కేవలం రూ.1.3 లక్షలే తక్కువైనప్పటికీ, 14 నెలల తర్వాత  సిప్ ప్రారంభించడంతో ఏకంగా రూ.10.9 లక్షల తక్కువ ప్రాఫిట్ పొందుతాడు. మొదటి ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్సెండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఎక్స్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్)14.4 శాతం) తో పోలిస్తే రెండో ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (14.7 శాతం)  కొద్దిగా ఎక్కువ రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించినా, లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్ కనిపించలేదు.  

రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ముఖ్యంశాలు..

1) మార్కెట్ సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఒక టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేవడం, పడడం) లో  హయ్యర్ లెవెల్స్ దగ్గర సిప్ మొదలు పెట్టిన వారు, దిగువ లెవెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర స్టార్ట్ చేసిన వారి కంటే ఎక్కువ సంపదను క్రియేట్ చేశారు.
2) ఆలస్యంగా సిప్ మొదలు పెట్టడంతోనే రెండో ఇన్వెస్టర్ లాభం తగ్గింది. 

గత 27 ఏళ్లలో మార్కెట్ బాగా పడిన సందర్భాల్లో ఇద్దరు వేరు వేరు ఇన్వెస్టర్లు చేసే సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విలువ  ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31 నాటికి ఎలా మారిందో కింద టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. 

గమనిక: ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  15 శాతం  (2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌010 నుంచి) , 16.6 శాతం (2015 నుంచి),  20.9 శాతం (2020 నుంచి).