నష్టాల్లో స్టాక్ మార్కెట్లపై కౌంటింగ్ ప్రభావం.. క్షీణించిన సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లపై కౌంటింగ్ ప్రభావం.. క్షీణించిన సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న క్రమంలో మంగళవారం (జూన్ 4)  భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఉదయం 9:53 గంటలకు BSE సెన్సెక్స్ 1,722 పాయింట్లు క్షీణించి (2.29శాతం) 74,746.55 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 519 పాయింట్లు క్షీణించి (2.23శాతం) 22,745.35 వద్ద ట్రేడ్ అవుతంది.

అంతకుముందు సెషన్‌లో 3 శాతం లాభాలతో ముగిసిన  స్టాక్ మార్కెట్ మంగళవారం ఓట్ల లెక్కింపు సరళితో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కౌంటింగ్ సరళి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎడీయే కూటమి 272 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తోంది. అయితే విజయం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలిసి రాలేదు.