హైదరాబాద్, వెలుగు: డబ్బు సంపాదించాలనేది అందరి కోరిక. దానికి ఎన్నో మార్గా లున్నా,ఇంకా సులువైన మార్గం ఉందా? అని ఆలోచిం చేవాళ్లు కోకొల్లలు. అలాంటి వారికోసం సామాజిక మాధ్యమాలు వేదికగా ఎన్నో లైవ్ క్విజ్ గేమ్ లు అందుబాటులోకి వచ్చాయి. రూ.లక్ష నుంచి పది లక్షల వరకు సంపాదించుకునే వీలుని ఈ ఆన్లై న్ గేమ్ షోలు కల్పిస్తున్నాయి . దీంతో వీటిని అనుసరిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. లైవ్ క్విజ్ ప్రోగ్రాం ల ద్వారా కరెం ట్ ఎఫైర్స్, జనరల్ నాలెజ్డ్ ప్రశ్నలను అడుగుతూ సరైన సమాధానం చెప్పేవారి పేటీఎంలోకి మనీ చేరే అవకాశం కల్పిస్తుండటంతో అనేకమంది ఈ ఆన్లైన్ క్విజ్ గేమ్ షో యాప్ లను ఇన్ స్టాల్ చేసుకుం టున్నారు. ఈ గేమ్ షో యాప్ లు పదుల సంఖ్య లో ప్లే స్టోర్ లలో దర్శనమిస్తున్నాయి .
ఆన్లైన్ వేదికగా లైవ్ క్వి జ్ గేమ్ లు
క్విజ్ గేమ్ లు ఇప్పుడు ఆన్లైన్ లో విరివిగా వచ్చేస్తున్నాయి . గో మిలీనియర్, లోకో త్రివియా క్విజ్ గేమ్ షో, త్రివియా క్రాక్, బాజీ నౌ, క్విజప్, 94%- క్విజ్ త్రివియా, లాజిక్- హెచ్ క్యూ త్రివియా, 70’s క్విజ్ గేమ్, క్విజ్ ఆఫ్ నాలెడ్జ్ వంటి అనేక యాప్ లు ఇప్పుడు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి .వీటిని డౌన్ లోడ్ చేసుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది . త్రివియా క్రాక్ అనే లైవ్ క్విజ్ షో యాప్ ని ఇప్పటి కే 64లక్షలకు పైగా జనం ఇన్ స్టా ల్ చేసుకున్నారు. దీని తర్వాత స్థా నంలో బాజీ నౌ గేమిం గ్ యాప్ ను 50 లక్షల మంది ఇన్ స్టా ల్ చేసుకున్నారు.
కాసులు కు రిపిస్తున్న క్వి జ్ గేమ్
ఉచితంగా డబ్బులు వస్తాయంటే ఎవరు మాత్రం వద్దంటారు. అందుకే ఈ ఆన్ లైన్ క్విజ్ గేమ్ లలో అనేకమంది పాల్గొం టున్నారు. ఈ క్విజ్ గేమ్ ఆడాలనుకునే వారు యాప్ ని ఇన్ స్టా ల్ చేసి వారి పేరు, మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వాలి .ఆ తర్వాత స్క్రీన్ మీద గేమ్ ఎన్ని గంటలకు ఉంటుంది ? ఎలా ఆడాలి? డబ్బులు పేటీఎంకి ఎలా యాడ్ అవుతాయి? అనే వివరాలుం టాయి. గేమ్ స్టా ర్ట్ అయ్యే అరగంట ముందుగానే నోటి ఫికేషన్ వస్తుంది . ప్రతి గేమ్ లో 12ప్రశ్నలుం టాయి.మూడు ఆప్షన్లు ఉంటాయి. సమయం కేవలం పది సెకన్లు మాత్రమే. ఆ టైంలోనే కరెక్ట్ ఆన్సర్ పెట్టా లి. తప్పు పెడితే ఎలిమినేట్ అవుతారు.క్విజ్ లో ఎంతమంది గెలిస్తే వారికి క్విజ్ లో ఆఫర్ చేసిన మనీని డివైడ్ చేసి పంచుతారు. గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఆ యాప్ లిం క్ ని ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే అదనపు లైఫ్ పొందే అవకాశం ఉంటుంది . ఈ లైఫ్ ల ద్వారా ఎలిమి-నేట్ అయ్యాక కూడా తిరిగి గేమ్ లో కొనసాగవ-చ్చు. లిం క్ ని షేర్ చేశాక వారు కూడా ఆ గేమ్ ని ఆడితే షేర్ చేసిన వారికి ఆడిన వారికి పది రూపాయల యాడ్ అవుతాయి. పండగలకు, ప్రత్యేక సందర్భాలకు ఎక్కువ మనీ ఆఫర్, సర్ ప్రైజ్ బొనాం జా బాక్స్ లు ఉంటాయి.
తెరవెనుక వ్యా పారం
ఈ ఆన్లైన్ గేమ్ లను అబుదాబి, ముంబయి వంటి ప్రధాన పట్టణాల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ గేమ్ లలో లైవ్ లో యాంకర్లు వచ్చి ప్రశ్నలు అడుగుతారు. కొన్ని గేమ్ లలో డైరెక్ట్ గా ప్రశ్న, సమాధానాలు ఉంటాయి. అందరికి బాగా తెలిసిన పేరున్న యాం కర్లనే ఈ గేమ్ లకి హోస్ట్ లుగా పెట్టా రు. దీంతో చాలా మందికి ఇవి తొందరగా రీచ్ అవుతున్నాయి . యాప్ ఎంత ఎక్కువ మంది ఇన్ స్టా ల్ చేసుకుం టే అంత ఇంటర్నల్ కొలాబరేషన్ ఉంటుంది . దీన్ని బట్టి ప్రముఖ సంస్థలు ఈ గేమిం గ్ యాప్ కి యాడ్ లు ఇస్తారు. వీరి గేమ్ లో పెట్టే మనీ కన్నా యాడ్ ల ద్వారా వీరికి వచ్చే ఆదాయం అధికంగా ఉంటుంది . అంతేకాకుం డా ప్రజలు తమ మెయిల్ ఐడీ, ఫోన్ నెం బర్ పెట్టి లాగిన్ అవడం వల్ల ఈ గేమిం గ్ యాప్ లతో లింకప్ అయిన సంస్థలు తమ ప్రకటనలు మెయిల్, మెసేజ్ లరూపంలో పంపించి ప్రచారం చేసుకుంటాయి.